పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-11 09:33:01  IST  )

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయనపై పూనం వంశీ అనే వ్యక్తి దాడికి యత్నించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లిన వంశీ.. అనుచరులు ఉండగానే ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు...

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు(Polavaram MLA Chirri Balaraju) క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయనపై పూనం వంశీ(Poonam Vamsi) అనే వ్యక్తి దాడికి యత్నించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లిన వంశీ.. అనుచరులు ఉండగానే ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే గన్ మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై సోషల్ మీడియాలో పూనం వంశీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీంతో వంశీపై ఇటీవల ఎమ్మెల్యే వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వంశీని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తాజాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పూనం వంశీ వెళ్లారు. అనంతరం హల్ చల్ చేశారు. ఎమ్మెల్యేపై బూతులు మాట్లాడుతూ వాగ్వాదానికి దిగారు. అంతటిఆకకుండా దాడికి యత్నించారు. దీంతో వంశీని ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దాడికి యత్నించిన దృశ్యాలు ఎమ్మెల్యే కార్యాలయంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story