‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘ది ప్యారడైస్’ దర్శకుడు

by Pulgam srinivas |

‘ది ప్యారడైస్’ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని, రెండు పార్ట్‌ల షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేయాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భావిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘ది ప్యారడైస్’ దర్శకుడు
X

దిశ, వెబ్ డెస్క్: నాచురల్ స్టార్ నాని హీరోగా, మమతా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైస్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా, అనంతరం విడుదల తేదీని ఆగస్టు 21కు వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆగస్టు 21న కూడా విడుదలయ్యే అవకాశాలు కనబడడం లేదు. ఈ చిత్ర విడుదల తేదీ పదేపదే వాయిదా పడుతున్న నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైస్’ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా రెండు పార్ట్‌లకు సంబంధించిన షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసి మొదటి భాగం విడుదలైన తక్కువ వ్యవధిలోనే రెండో భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు భాగాల షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసే ప్రక్రియ కారణంగానే సినిమా విడుదల ఆలస్యమవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ‘ధురంధర్’ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా విడుదల చేసి, రెండు పార్ట్‌ల షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అదే ఫార్ములాను ‘ది ప్యారడైస్’ విషయంలో శ్రీకాంత్ ఓదెల ఫాలో అవుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story