- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫస్ట్ వీక్‌లో వరల్డ్‌వైడ్‌గా అన్ని కోట్లు రాబట్టిన ‘పెద్ది’.. ఆఫీషియల్ పోస్టర్ రిలీజ్
వారం రోజుల్లో ‘పెద్ది’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 345 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. జూన్ 3న ఈ మూవీ ప్రీమియర్లు ప్రదర్శించగా, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గురువారం రిలీజ్ కావడంతో మొదటి నాలుగు రోజుల్లోనే అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా, సోమవారం నుంచి స్టడీ కలెక్షన్లతో మంచి వసూళ్లను కొనసాగిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన వారం రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తికాగా ప్రపంచవ్యాప్తంగా 345+ కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లు సాధించి, ఎలాంటి విజయాన్ని అందుకుంటుందనే ఆసక్తి మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ నెలకొంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించగా, శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.






