- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కాంగ్రెస్ వృద్ధ నాయకుడు
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ వృద్ధ నాయకుడు కటిక శాంతి కుమార్ (85) తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

దిశ, మక్తల్ : రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ వృద్ధ నాయకుడు కటిక శాంతి కుమార్ (85) తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఆయన ఎడమ చేయి, కుడి కాలుకు ఫ్రాక్చర్లు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాయచూరు ఆసుపత్రికి తరలించారు.
1970 దశకం నుంచి మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీకి సేవలందిస్తున్న కటిక శాంతికుమార్, కాంగ్రెస్ నాయకుడిగా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎల్లమ్మకుంటలో ఉన్న తన సొంత ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వస్తుండగా రహదారి మలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన చేయి, కాలుకు ఎముకలు విరిగాయి. విషయం తెలిసిన వెంటనే మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి శాంతికుమార్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.






