క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ కు సంజాయిషీ ఇచ్చిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

ఇటీవల కామారెడ్డికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ కు సంజాయిషీ ఇచ్చిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
X

దిశ, కామారెడ్డి : ఇటీవల కామారెడ్డికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో గురువారం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై క్రమశిక్షణ కమిటీ సంఘం వైస్ చైర్మన్ శమ్మోహన్ ను కలిసి సంజాయిషీ ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, కామారెడ్డి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే వివిధ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా చంద్రశేఖర్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

Next Story