- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ట్రాక్‌పైకి ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో తృటిలో భారీ రైలు ప్రమాదం తప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే అధికారుల సమయస్ఫూర్తి, లోకో పైలట్ల అప్రమత్తతో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. భువనేశ్వర్ (Bhubaneswar)కు సమీపంలోని హరిదాస్‌పూర్ (Haridaspur) రైల్వే స్టేషన్ వద్ద ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని కటక్ - భద్రక్ సెక్షన్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఒకే లైన్‌పై భద్రక్ వైపు వెళ్తున్న మెము (MEMU) ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఎదురెదురుగా వచ్చాయి. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఉన్న విషయాన్ని లోకో పైలట్లు సకాలంలో గుర్తించి, రైళ్లను ఒకదానికొకటి కొంత దూరంలోనే నిలిపివేశారు.ఆ దృశ్యాలను చూసి ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. ప్రాథమిక విచారణ అనంతరం, డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను హరిదాస్‌పూర్ స్టేషన్ మాస్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆదేశాలు జారీ చేసింది. సిగ్నలింగ్ లోపమా, మానవ తప్పిదమా అనే కోణంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.






