- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖరీఫ్ సీజన్ ఎరువులపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎమ్మెల్యే
ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఎరువులు, యూరియాలను అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

X
దిశ, మిర్యాలగూడ టౌన్: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఎరువులు, యూరియాలను అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం వ్యవసాయ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్‌లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గతంలో యూరియా సరఫరాలో జరిగిన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. యూరియా యాప్‌లో ఉదయం, సాయంత్రం ఓపెన్ చేసేందుకు ఉన్నతాధికారులను కొరనున్నట్లు తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందివ్వాలని పిఎసిఎస్ చైర్మన్‌లను కోరారు. వ్యవసాయ శాఖ, ప్రాథమిక సహకార సంఘాల అధికారులు సమన్వయంతో పని చేసి రైతులు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓ లు , సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






