ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజలకు భరోసా కలుగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా
X

దిశ, నిజాంసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజలకు భరోసా కలుగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. గురువారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం, ప్రమాదాలు తదితర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సమయంలో అందే ఈ ఆర్థిక సహాయం వారి కుటుంబాలకు ఊరటనిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తూ ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు చేరేలా కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకొని వాటిని వినియోగించుకోవడం ద్వారా తమ ఆర్థిక, సామాజిక సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక ప్రజాహిత కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు భుజంగారి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రజా పండరి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంకు లక్ష్మయ్య, ఉప సర్పంచ్ అనీస్ పటేల్, నాయకులు గుర్రపు శ్రీనివాస్, గాండ్ల రమేష్, రామాగౌడ్, ఊరటి వెంకట్, గోలి లక్ష్మణ్, బింగి శేఖర్, కోట కిషోర్ కుమార్, కంబాపురం సాయిలు, బొడ్డు అంజయ్య, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story