- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజం భాగస్వామ్యం కావాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజం భాగస్వామ్యం కావాలని ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు.

దిశ, కామారెడ్డి : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజం భాగస్వామ్యం కావాలని ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కల్పించే వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి ఆటంకమని, ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, మంచి భవిష్యత్తు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరంపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులు అని, వారిని పనుల్లో నిమగ్నం చేయడం వల్ల వారి శారీరక, మానసిక, విద్యా అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను ఏ విధమైన పనుల్లోనూ నియమించరాదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధిత శాఖలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, బాల కార్మికులను గుర్తించి వారికి విద్యా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా బాల కార్మికులను పనుల్లో పెట్టుకోకుండా అలాంటి ఘటనలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. "బాల్యం చదువుకోడానికి పని చేయడానికి కాదు" అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సాధన సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గిరిజ, సీఎస్‌ఎం మమత, సంధ్యారాణి, విశ్వజ్యోతి తదితరులు పాల్గొన్నారు.






