ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా తేజావత్ కిరణ్ బాధ్యతల స్వీకరణ

by Jakkula.Mamatha |

నిర్మల్ జిల్లా ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతన సబ్ రిజిస్ట్రార్‌గా కిరణ్ తేజావత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా  తేజావత్ కిరణ్ బాధ్యతల స్వీకరణ
X

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతన సబ్ రిజిస్ట్రార్‌గా కిరణ్ తేజావత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన స్వామి దాస్ బదిలీపై నిర్మల్‌కు వెళ్లడంతో, ఆయన స్థానంలో తేజావత్‌ కిరణ్ ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుని సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story