మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మహర్దశ.. రూ.6 కోట్లు కేటాయింపు

by Vemula.Srinu Prasad |

తన నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేతమైన మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్ దృష్టి పెట్టారు. ఇందుకు రూ. 6 కోట్లను కేటాయించారు. ఈ మేరకు పనులు శరవేగంగా చేపట్టాలని నిర్ణయించారు. ...

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మహర్దశ..  రూ.6 కోట్లు కేటాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: తన నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేతమైన మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి(Mangalagiri Lakshmi Narasimha Swamy) ఆలయం అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్ దృష్టి పెట్టారు. ఇందుకు రూ. 6 కోట్లను కేటాయించారు. ఈ మేరకు పనులు శరవేగంగా చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాదు ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు యాగశాల, గంట మండపం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జూలై 3న ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. అదే రోజు మంత్రి నారా లోకేష్ చేతులు మీదుగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి.

నారా లోకేశ్ రెండు సార్లు మంగళగిరి నుంచి పోటీ చేశారు. తొలిసారి ఓటమి పాలయ్యారు. రెండోసారి భారీ మెజార్టీ దక్కించుకున్నారు. పాదయాత్రలో మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్న సమయంలో ఆలయం అభివృద్ధిపై హామీ ఇచ్చారు.ఈ మేరకు ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పనులు పూర్తి అయితే ఆలయం రూపు రేఖలు మారిపోనున్నాయి. దీంతో భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story