- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన.. ఆర్థిక సలహా మండలి సంచలన ప్రతిపాదన
లోక్‌సభ స్థానాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM) కీలక ప్రతిపాదనలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) సంచలన ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. దేశంలో మారుతున్న జనాభా, పట్టణీకరణ ప్రమాణాలకు అనుగుణంగా లోక్‌సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ జరగాలని తేల్చి చెప్పింది. వారు నూతన నివేదిక ప్రకారం.. దేశంలో ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను ఏకంగా 824కు పెంచాలని ప్రతిపాదించింది.
చిన్న రాష్ట్రాల్లో డబుల్.. పెద్ద రాష్ట్రాల్లో 50 శాతం
ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించిన కొత్త మోడల్ ప్రకారం.. భౌగోళికంగా పెద్దగా ఉన్న రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను దాదాపు 50 శాతం మేర పెంచాలని సూచించారు. తక్కువ ప్రాతినిధ్యం ఉన్న చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్యను నేరుగా రెట్టింపు (Double) చేయాల్సిన అవసరం ఉందని మండలి చెప్పింది. దీంతో జాతీయ స్థాయిలో ఆయా ప్రాంతాల ప్రజల గొంతుక మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా గతంలో జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పునర్విభజన వల్ల రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోతుందనే ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదన చేసింది. మొత్తం పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల సంయుక్త సీట్ల వాటా శాతం దెబ్బతినకుండా, నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా లోక్‌సభ స్థానాలను భారీగా పెంచేలా సమగ్ర ఫార్ములాను సిద్ధం చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై పీఎం ఆర్థిక సలహా మండలి చేసిన ఈ ముసాయిదా ప్రతిపాదనలు చట్టరూపం దాల్చితే.. రానున్న రోజుల్లో భారత పార్లమెంటరీ వ్యవస్థ స్వరూపమే మారనుంది.






