- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > జాతీయ రహదారిపై రాస్తారోకో.. దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికుల డిమాండ్
జాతీయ రహదారిపై రాస్తారోకో.. దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికుల డిమాండ్
by Jakkula.Mamatha |
దెబ్బతిన్న సోనాపూర్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం సోనాపూర్ గ్రామస్తులు రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు.

X
దిశ, వాంకిడి: దెబ్బతిన్న సోనాపూర్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం సోనాపూర్ గ్రామస్తులు రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. 2021లో జాతీయ రహదారి పనుల కోసం డీబీఎస్ సంస్థ ఈ ప్రాంతం నుంచి మట్టి తరలించారు. దీంతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అలాగే గణేష్ పూర్ బస్ స్టాప్ వద్ద అసంపూర్తిగా వదిలేసిన సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులు సైతం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గణేష్ పూర్ జాతీయ హైవే పై రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు కలుగజేసుకుని ఆందోళన విరమింపజేశారు.
Next Story






