ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ లక్ష్యం : ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి  తీసుకువెళ్లడమే తమ లక్ష్యం : ఎమ్మెల్యే  కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
X

దిశ, తిమ్మాజీపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద రెండో రోజు ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సుయాత్రలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి నేతృత్వంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రెండో రోజు బస్సు యాత్ర కొనసాగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లోకి పథకాలు తీసుకోవడమే ఈ బస్సు యాత్ర ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదవుల కొరకు కాదు.. ప్రజా శ్రేయస్సు కొరకు నియోజకవర్గ ప్రజలు త‌న‌ను ఒకసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి అత్యంత ఉన్నత స్థాయిలో నిలబెట్టారని దానికి సర్వదా ఈ నియోజకవర్గానికి రుణపడి ఉంటానని నియోజకవర్గ అభివృద్ధిలో ముందు ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పాటునందిస్తుంద‌ని ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి అండగా నిలబడుతుందని తెలియజేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వడ్డీ లేని రుణాలు రైతు రుణమాఫీ,రైతు భరోసా భూమిలేని నిరుపేదలకు రైతు ఆత్మీయ భరోసా, సన్న వడ్లకు బోనస్ నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల పంపిణీ ఉచిత సన్న బియ్యం పంపిణీ నాగర్ కర్నూల్ జిల్లాలో 550పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనేక పథకాలను చేపట్టి నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలియజేశారు.

Next Story