- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17 న సీఎం నల్లగొండ పర్యటన..
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17 వ తేదీన నల్లగొండకు రానున్నారని.. కాగా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, నల్లగొండ బ్యూరో: సుమారు 14,500 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యాం రోడ్ల శంకుస్థాపన నిమిత్తం ఈ నెల 17 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా, కనగల్ వస్తున్న దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రాకకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఆర్ అండ్ బి అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న హ్యాం రోడ్ల పైలాన్, బహిరంగ సభ నిర్వహించే ప్రదేశం, బహిరంగ సభకు ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. హ్యాం రోడ్లతో పాటు, మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిచే ఇక్కడ నుండే శంకుస్థాపనలు నిర్వహించే విషయమై సమావేశంలో మంత్రి అధికారులతో చర్చించారు.
అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు..
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి తో ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం చేయించి ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని ఆధునికరించేందుకు చర్యలు తీసుకుంటున్నందున అవకాశం ఉంటే దేవాలయ ఆధునికరణ పనులకు కూడా ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు. శిలాఫలకం, ఇతర ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కొరారు. అనంతరం హ్యం రోడ్ల శంకుస్థాపన, బహిరంగ సభకు హాజరయ్యే విధంగా ప్రాథమికంగా ఏర్పాట్లు చేసేలా మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. అంతేకాక సభకు హాజరయ్యే ప్రజల కోసం టెంట్లు, కుర్చీలు, తాగునీరు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, ఏర్పాట్లలో ఎక్కడ లోపం లేకుండా చూడాలన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్నవారు..
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, జిల్లా అధికారులతో కలిసి గురువారమే కనగల్ వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు, హ్యం రోడ్ల శంకుస్థాపనకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, అలాగే పైలాన్ ఏర్పాటు చేసే స్థలం, బందోబస్తుతో సహా పరిశీలించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, డి ఈ గణేష్, జెడ్పిసిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఈ సమావేశంలో ఉన్నారు .






