- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతీయుల షిప్‌పై అమెరికా దాడి.. ఏపీ మెరైన్ ఇంజినీర్ మృతి
పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఒమన్‌పై అమెరికా దాడి చేసింది. అంతేకాదు భారతీయులున్న నౌకపైనా అమెరికా బాంబుల వర్షం కురిపించింది...

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఒమన్‌పై అమెరికా దాడి చేసింది. అంతేకాదు భారతీయులున్న నౌకపైనా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు చనిపోయారు. వీరిలో ఏపీకి చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు విలవిలలాడిపోతున్నారు. విశాఖకు చెందిన సురేశ్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ నెల 24న సురేశ్ పట్నాల పెళ్లి రోజు కావడంతో కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. తమ వాడు వస్తారని ఎదురు చూస్తున్నామని, ఇలాంటి విషాదకర వార్త వినాల్సి వచ్చిందని సురేశ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా సురేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని వేడుకున్నారు.






