బిర్యానీ కొనిస్తే అమ్మాయిని అనుభవించొచ్చా?

by Sujitha Rachapalli |   (  Updated:2026-06-11 14:12:21  IST  )

రూ. 370ల బిర్యానీ కొనిస్తే చాలు అమ్మాయిని అనుభవించవచ్చనే ఆలోచన ఈ తరం కుర్రాళ్లలో ఉందంటేనే మన సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. మన సొసైటీ తీరు, మనం పిల్లలను పెంచే పెంపకం గురించి మరోసారి ఆలోచించుకోవాలి.

బిర్యానీ కొనిస్తే అమ్మాయిని అనుభవించొచ్చా?
X

దిశ, ఫీచర్స్ : రూ. 370ల బిర్యానీ కొనిస్తే చాలు అమ్మాయిని అనుభవించవచ్చనే ఆలోచన ఈ తరం కుర్రాళ్లలో ఉందంటేనే మన సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. మన సొసైటీ తీరు, మనం పిల్లలను పెంచే పెంపకం గురించి మరోసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు అమ్మాయిలంతా బాధపడాలి. అది కూడా ఓ ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమక్షంలో ఇదంతా జరగడం.. దానికి అతను కూడా చప్పట్లు కొట్టి సన్మానించడం నిజంగా శోచనీయం. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోర్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన బిగ్ బాస్‌లోనూ పార్టిసిపెంట్‌గా వెళ్లాడు. అక్కడ తన నీచపు బుద్ధితో కొన్నిసార్లు చివాట్లు తిన్నాడు. కానీ ఇదంతా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న స్ట్రెస్ కారణంగా జరగొచ్చని చాలా మంది అనుకున్నారు. కానీ అతని బుద్ధి అలాంటిదేనని మరోసారి రుజువైంది. గురుగ్రామ్‌లో ఈ మధ్య ఓ కామెడీ షో చేశాడు ప్రణీత్. దీనికి ఈ తరం అబ్బాయిలు చాలా మందే హాజరయ్యారు. అయితే వీరిలో కొందరిని జోక్స్ షేర్ చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో ఓ ప్రబుద్ధుడు.. గర్వంగా ఓ అమ్మాయికి ఫుడ్ ఇప్పిస్తే సెక్సువల్‌గా వాడుకోచ్చనే జోక్ చెప్పాడు. దీన్ని ఖండించాల్సింది పోయిన తోటి అబ్బాయిలు, ఆ కమెడియన్ పగలబడి నవ్వారు. వాట్ ఏ జోక్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కానీ ఈ కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక కథ అడ్డం తిరిగింది. భారీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ జోక్ చెప్పిన బుద్ధి లేని మనిషి జాబ్ కూడా పోగొట్టుకోగా.. ప్రణీత్ లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఇన్‌స్టా ఎకౌంట్‌ను డీయాక్టివేట్ చేశాడు.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు. కానీ సారీ చెప్తే బుద్ధి మారుతుందనేది నిజమేనా?

ఇంతకీ జోక్ ఏంటి?

ఈ అబ్బాయి తన లవర్‌ను డిన్నర్ డేట్‌కు తీసుకెళ్లాడు. రూ.370 ధర ఉన్న చికెన్ బిర్యానీ ఇప్పించాడు. ఆ తర్వాత అమ్మాయి తనను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగింది. కానీ ఇతనికి అది నచ్చలేదట. నా దగ్గర డబ్బులతో బిర్యానీ తిన్నది కదా.. దానికి సమానమైన వసూల్ జరగాలి కదా అనుకున్నాడు. ఆ అమ్మాయి బాడీని వాడుకోవాలనుకున్నడు. ఆ అమ్మాయి కన్సెంట్ లేకుండానే కిస్ పెట్టేశాడు. డ్రెస్ విప్పడం మొదలు పెట్టాడని.. చెప్తున్నడు. కానీ పక్కనున్నోళ్లు.. ఈ స్టాండప్ కమెడియన్.. తగలబడి నవ్వుతుంటే.. అతను రెచ్చిపోయి.. ప్రైవేట్ పార్ట్స్ వర్ణించడం, బాడీని ఎలా వాడుకున్నాడో చెప్పడం, డ్రెస్ ఎలా విప్పాడో వివరించడం... చేశాడు. ఈ స్టోరీ మొత్తం బీప్‌లు వేసుకోవచ్చు.

ప్లేట్ ఫుడ్.. ఉమెన్ బాడీ కాంట్రాక్ట్..

అంటే ఇక్కడ ఓ అబ్బాయి ప్రేమ అని చెప్పి తీసుకుపోయి.. ప్లేట్ ఫుడ్ పెట్టించి.. బిల్లు కడితే.. ఉమెన్ బాడీతో.. కాంట్రాక్ట్.. కుదుర్చుకున్నట్లేనా? ఎంత విషపూరితమైన ఆలోచన ఇది. ఒక్క జోక్ ఎంటైర్ జనరేషన్‌ను ప్రశ్నించేలా చేస్తలేదా? ఒక జోక్‌కు నవ్వాలా లేదా క్వశ్చన్ చేయాలా అనేది కూడా తెలియట్లేదా? అసలు ఈ రూ. 370తో అమ్మాయి మేకప్ కిట్‌లో ఒక్క ఐటెమ్ అయిన వస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. దీనివల్ల ఒక్కటి మాత్రం అర్థమైంది.. అమ్మాయి కన్సెంట్‌కు ధరతో ముడిపెడుతరనేది మాత్రం తెలుస్తుంది. ఈ వీడియో చూశాక ఆ ప్రబుద్ధుల తల్లిదండ్రులు వాళ్ల పెంపకం పట్ల ఎంత సిగ్గుపడుతున్నారో కదా? కాదు వాళ్లకు కూడా అక్కాచెల్లెళ్లు ఉంటరు కదా? ఇలాంటి నీచపు మాటలు ఎలా మాట్లాడుతరు? ఇలాంటోళ్లకు బుద్ధి ఎలా వస్తుందంటరు? అని సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నరు.

Next Story