గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు మృతి

by Nallavelli.Anjaneyulu |

మండల పరిధిలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వ్యక్తి మృతి చెందిన ఘ‌ట‌న నర్వ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు మృతి
X
దిశ, నర్వ : మండల పరిధిలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వ్యక్తి మృతి చెందిన ఘ‌ట‌న నర్వ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. సబ్ ఇన్‌స్పెక్టర్ పబ్బతి రమేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మరికల్ మండలంలోని చిత్తనూర్ గ్రామానికి చెందిన బండ రాంరెడ్డి (45) రైతు ఇవాళ సాయంత్రం తన పొలంలో పశువులకు మేత వేసి, తన మోటార్ సైకిల్ పై TG38 4781 పై ఇంటికి తిరిగి వస్తుండగా నర్వ మండల పరిధిలోని రాంపూర్ గేట్ సమీపంలో నాయరా పెట్రోల్ బంకుకు దగ్గర వెళ్తుండగా.. కాటన్ మిల్లు వద్ద అమరచింత వైపు నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం మోటార్ సైకిల్ ను వేగంగా వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంరెడ్డి కిందపడిపోగా, అదే దారిలో వెళ్తున్న తోటి గ్రామస్థుడు టి. శ్రీకాంత్ గమనించి బాధితుడి కుమారుడు బి. హర్షవర్ధన్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.

హర్షవర్ధన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, ఎడమ చెవి కింద తీవ్ర రక్తస్రావం, కుడి చేయి విరిగి స్పృహ తప్పి ఉన్న తన తండ్రిని మొదట ఓమ్ని వాహనంలో మరికల్ కు, తరలించారు. మరికల్ నుంచి 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే రాంరెడ్డి మరణించినట్టు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ లో డ్యూటీ డాక్టర్లు మరణించినట్లు తెలియజేశారని తెలిపారు. ఉదయం 08:30 గంటలకు మృతుడి కుమారుడు బి. హర్షవర్ధన్ రెడ్డి నర్వ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు నర్వ ఎస్సై పబ్బతి రమేష్ తెలిపారు.

Next Story