- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుక్మిణి వసంత్ కల నెరవేరినట్టేనా.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్!
ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా కుర్రకారు హృదయాలను గెలుచుకుంటున్న యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రుక్మిణి వసంత్..

దిశ, సినిమా: ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా కుర్రకారు హృదయాలను గెలుచుకుంటున్న యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రుక్మిణి వసంత్.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతితక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు.. ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ సినిమాతో కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పలు ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తుండగా.. తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి.. తెలుగులో తన ఫేవరెట్ హీరో నాని అని తెలిపింది. ఆయన రేంజ్ డిఫరెంట్ అని, అతను చేసే సినిమాల్లో ఓ మీనింగ్ ఉంటుందని, అలాగే కొత్తదనంతో పాటు కామెడీ కూడా ఉంటుందని తన అభిప్రాయాన్ని పంచుకున్న ఈ బ్యూటీ.. ఆయనతో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపింది. ఇందులో భాగంగానే.. నాని నిర్మాణంలో రాబోయే చిత్రానికి హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను ఖరారు చేసినట్లు ప్రజెంట్ టాక్. 'దండోరా' చిత్రంతో గుర్తింపు పొందిన మురళికాంత్ దర్శకత్వంలో నాని ఒక ఆసక్తికరమైన కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే.. ఇందులో ప్రధాన నటుడిని ఇంకా ఖరారు చేయాల్సి ఉండగా.. హీరోయిన్‌గా మాత్రం రుక్మిణి వసంత్‌ను ఫైనల్ చేశారట మేకర్స్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. ఫైనల్‌గా రుక్మిణి కల నెరవేరినట్టుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






