- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకట్టుకున్న పేరిణి నృత్య ప్రదర్శనలు
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత పేరిణి రాజ్ కుమార్ శిష్య బృందం ప్రదర్శించిన పేరిణి నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నాయి.

దిశ, రవీంద్రభారతి: ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత పేరిణి రాజ్ కుమార్ శిష్య బృందం ప్రదర్శించిన పేరిణి నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నాయి. గురువారం రాత్రి తెలంగాణ ప్రజాకళ 99 రోజుల సాంస్కృతిక మహోత్సవంలో భాగంగా రవీంద్ర భారతిలోని పాల్కురికి సోమన్న మూల వేదిక పై పేరిణి నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.ఏనుగు నరసింహారెడ్డి (ఐఏఎస్) మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పిల్లలు చరవాణిలకు, టీవీలకు పరిమితం కాకుండా చారిత్రాత్మక పేరిణి నృత్యాన్ని నేర్చుకోవడం అభినందనీయం అని అన్నారు.
కాకతీయుల కాలం నాటి ఈ వీర నృత్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించటానికి ఇలాంటి ఉచిత శిక్షణ శిబిరాలు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డా. నరసింహ రెడ్డి చిన్నారులను సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ సాంస్కృతిక శాఖ సలహాదారులు దినకర్, పల్లె నర్సింహా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జానపద, సామాజిక చైతన్య గీతాలతో సభను ఉత్సాహపరిచారు.






