ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ యాక్షన్ ‘ఇసాకపట్నం’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Chukka Sudharani |

సముద్ర ఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘ఇసాకపట్నం’.

ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ యాక్షన్ ‘ఇసాకపట్నం’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: సముద్ర ఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘ఇసాకపట్నం’. 1990నాటి బ్యాక్ డ్రాప్ కోస్తాంధ్రలో కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో అధికారం కోసం జరిగే పోరాటాలు, కుటుంబ విభేదాలు, రాజకీయకుట్రలు, గ్యాంగ్‌స్టర్ సంఘర్షణలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌పై అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 7 ఎపిసోడ్స్ ఉన్నా ఈ ‘ఇసాకపట్నం’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 2 నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్, ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్ టైటిల్స్‌తో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు.. ‘మూడు శక్తులు ఢీ కొన్నప్పుడు ఏం జరుగుతుంది?’ అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ సిరీస్‌పై హైప్‌ను క్రియేట్ చేస్తుంది. దీనికి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తుండగా.. ‘అధికారం కోసం పోరాటం.. ప్రతీకారం కోసం అన్వేషణ.. చెరగని ముద్ర వేసే కథ..’ అంటూ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన ఈ పోస్టర్ ప్రజెంట్ వైరల్‌గా మారింది.

Next Story