మేనరికంతో పిల్లలు పుట్టరా?

by Sujitha Rachapalli |

నా పేరు శ్రావణి. వివాహమై నాలుగేళు అయింది. నా సమస్యంతా ఇంకా పిల్లలు లేరనే. మా వారు ఉద్యోగ రీత్యా నెలలో పది రోజులు మాత్రమే ఇంటి దగ్గరుంటారు.

మేనరికంతో పిల్లలు పుట్టరా?
X

ప్రశ్న : నా పేరు శ్రావణి. వివాహమై నాలుగేళు అయింది. నా సమస్యంతా ఇంకా పిల్లలు లేరనే. మా వారు ఉద్యోగ రీత్యా నెలలో పది రోజులు మాత్రమే ఇంటి దగ్గరుంటారు. అయితే పిల్లలు పుట్టక పోవడం గురించి గైనకాలజిస్టును కలిశాం. నాకు స్కాన్ చేసి అమ్మాయి బలహీనంగా ఉంది.. గర్భాశయం చిన్నదిగా ఉందని మందులు రాశారు. ఇప్పటికి ఆరు నెలలైంది కానీ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. ప్రతి నెలా పీరియడ్ టైమ్‌లో రమ్మంటే వెళ్తున్నాను. డాక్టర్లు అంతకన్నా ఏం చెప్పట్లేదు. మేమేం చేయాలి? అండం విడుదలయ్యే రోజులు తెలుసుకోవచ్చా? శృంగారం పట్ల అసహ్యం కలుగుతోంది. ఒక్కోసారి కోపం వచ్చి ఎందుకులే ఇన్నేళ్లు లేనిది ఇక రాదనే నిరాశతో ఆయన్ని బాగా ఏడిపిస్తాను. ఇక హాస్పటల్‌కు వెళ్లాలని లేదు. మాది మేనరికం అయినందువల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? దయచేసి వివరించండి.

జవాబు : శ్రావణీ! ఇంత విసుగైతే ఎలా? ఓపిక ఉండాలి కదా! ఇద్దరిలో సమస్య ఉంది కాబట్టి ఇద్దరూ ఓపికగా మంచి డాక్టర్‌ను సంప్రదించి అన్ని పరీక్షలు, చికిత్సలు చేయించుకోవాలి. ఒకరికొకరు దూరంగా ఉండడం కూడా ఓ కారణం. రుతుక్రమం క్రమం తప్పకుండా ఉంటే నెలసరి ఆగిన 12వ రోజు నుంచి 16 రోజుల మధ్యన అండం విడుదల అవుతుంది. అప్పటి కలయికలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 1. మందులు వాడుతూనే ఉండాలి. 2. కలయికకు మందు, కలయిక జరిగేటప్పుడు భార్య నడుము కింద దిండు పెట్టుకుని కలయిక తర్వాత 20 నిమిషాలు లేవకుండా ఉండాలి. 3. 20 నిమిషాల వరకూ మూత్ర విసర్జన చేయవద్దు. నీటితో శుభ్రం చేసుకోవద్దు. 4. అన్నిటికీ మించి మానసిక ఒత్తిడి పనికిరాదు. దాని వలన హార్మోన్స్ విడుదల డిస్టర్బ్ అయ్యి, అండ విడుదల క్రమం తప్పుతుంది. 5. వీలైనంత వరకూ ప్రతిరోజూ పిల్లల కోసమే అనే టార్గెట్‌తో కాకుండా ఇద్దరి మధ్య ప్రేమ బంధాలు పెంచుకోవడం కోసమన్నట్లు శృంగారంలో ఆనందంగా, ఇష్టంగా పాల్గొనాలి. లేక పోతే మీరు అన్నట్లు సెక్స్ అంటేనే అసహ్యం పుడుతుంది. ముందు మీరు పాజిటివ్‌గా ఆలోచించడం మొదలు పెట్టండి.

Next Story