ఘట్కేసర్‌లో కిలో 70 గ్రాముల గంజాయి పట్టివేత..

by Kodari Anjali |

స్టల్లో ఉంటూ గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘట్కేసర్‌లో కిలో 70 గ్రాముల గంజాయి పట్టివేత..
X

దిశ, ఘట్కేసర్: హాస్టల్లో ఉంటూ గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులు పట్టుబడిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఖమ్మం పట్టణానికి చెందిన ధనుష్, లోకేష్ ఘట్కేసర్ పట్టణంలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. ఇటీవల గంజాయికి అలవాటు పడ్డ వీరు గంజాయి తాగుతూ, అవసరమైన వారికి అమ్మాలని నిశ్చయించుకొని గంజాయి ఆంధ్రా ప్రాంతం నుండి తీసుకుని వచ్చి అవసరమైన వారికి అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు యువకులను పట్టుకుని విచారించి వారి నుంచి ఒక కేజీ 70 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

Next Story