- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహింగ్యా గ్యాంగ్ ఖేల్ ఖతం..
గ్యాంగ్ (రోహింగ్యాలు) ఐదుగురు నిందితులను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, నల్లగొండ క్రైం: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వరుసగా ట్రాన్స్ ఫార్మర్‌లోని కాపర్ వైర్ ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు హమీద్ హుస్సేన్, అతని గ్యాంగ్ (రోహింగ్యాలు) ఐదుగురు నిందితులను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ డీఎస్పీ ఆఫీస్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలు వెళ్లడించారు. నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 17, 2025న ఉదయం నెళ్లుట్ల చందు కుమార్, నార్కట్‌పల్లిలోని కళ్యాణి స్టీల్ లిమిటెడ్ కంపెనీకి అడ్మిన్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాడు. తన కంపెనీలో ట్రాన్స్ ఫార్మర్లలో 21 వేల లీటర్ల ఆయిల్, కాపర్ కాయిల్స్, 220 కేవీ ట్రాన్స్ ఫార్మర్ నుంచి 3 హెచ్ వీ, 3 ఎల్వీ3LV కాపర్ ఎలిమెంట్స్‌ను, వైర్ పోయిందని నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో..
నార్కట్‌పల్లి ఎస్‌ఐ నమోదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 10న మధ్యాహ్నం నార్కట్‌పల్లి గ్రామ శివారులోని హైవేపై హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలో రెడ్డయ్య ఫ్యాక్టరీ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మూడు బైక్‌లపై వస్తున్న ఐదుగురు వ్యక్తులను ఆపి తనిఖీ చేశారు. బైక్‌లకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో పాటు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు పలు ట్రాన్స్ ఫార్మర్లలోని కాపర్ వైర్, ఆయిల్, అల్యూమినియం వైర్ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. హైదరాబాద్‌లోని బాలాపూర్ (బర్మా క్యాంప్) లో నివసించే హమీద్ హుస్సేన్, హఫీజ్ నగర్‌కు చెందిన జహంగీర్ ఆలం, నూర్ ఖాసీమ్, నూరుల్ అమీన్, నూరుల్ ఆలంలను రిమాండ్ కు తరలించారు.
బర్మా దేశం నుంచి వచ్చి..
నేరస్తులు సుమారు 12ఏళ్ల క్రితం బర్మా దేశం నుంచి శరణార్థులుగా భారతదేశానికి వచ్చి, కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి, ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు వచ్చి బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో నివసిస్తూ రోజువారీ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వారందరు కలిసి మద్యం సేవించే వారు. ఈ క్రమంలో వారికి మంచి స్నేహం ఏర్పడింది. వారు కూలి పనులు చేయగా వచ్చిన డబ్బు, వారి కుటుంబ అవసరాలకు, వారి జల్సాలకు సరిపోకపోవడంతో, వారందరు కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని, ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న కాపర్ మెటీరియల్, ఆయిల్, అల్యూమినియం వైర్లను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారందరు కలిసి బైక్‌లపై మూసివేసిన కంపెనీలు, గ్రామాలకు దూరంగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను గుర్తించి, రాత్రి సమయంలో గుర్తు తెలియని ఆటోలను అద్దెకు మాట్లాడుకుని వెళ్లి, పానాలు, కట్టర్ల సహాయంతో ట్రాన్స్ ఫార్మర్లను కట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డారు. సంబంధిత వస్తువులను దొంగిలించి ఆటోలో తీసుకెళ్లి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకుని, వచ్చిన డబ్బుల సమానంగా పంచుకుని వాటిని వారి కుటుంబ అవసరాలకు, జల్సాలకు వినియోగించేవారు. వీరిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 12 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి రూ.7,71,000ల నగదు 3 బైకులు, స్వాధీనం చేసుకున్నారు.






