- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను కాల్చి చంపిన కేసులో భర్తతో పాటు మరొకరు అరెస్ట్.. తుపాకీ స్వాధీనం
అనుమానంతో భార్యపై కాల్పులు జరిపి హత్య చేసిన సంఘటనలో నిందితుడు అరుణ్ కుమార్‌ను మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

దిశ,సిటీ క్రైమ్: అనుమానంతో భార్యపై కాల్పులు జరిపి హత్య చేసిన సంఘటనలో నిందితుడు అరుణ్ కుమార్‌ను మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మల్కాజ్గిరి జోన్ డీసీపీ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మల్కాజ్గిరి మారుతీ నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారీ దామర అరుణ్ కుమార్ కొన్ని సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నాడు. ఇద్దరు సంతానం. గోడ కూలిన సంఘటనలో కూతురు మరణించింది. ఆ తర్వాత అనారోగ్యానికి గురైన మొదటి భార్యను వదిలేసి ఆమె సోదరీ నిశారాణిని పెండ్లీ చేసుకున్నాడు. నిషారాణి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అరుణ్ కుమార్ ఆమెను చంపేయాలని కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జనవరి నెలలో మర్డర్ స్కెచ్ లో భాగంగా అరుణ్ కుమార్ పాత నేరస్తుడు ముజ్మిల్ అలీ ఖాన్ మరొకరితో కలిసి బీహార్ నుంచి తుపాకీని తీసుకువచ్చి అవకాశం కోసం చూస్తుండగా అంబర్ పేట్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు.
విచారణలో భార్యను చంపడానికి తుపాకీని కొనుగోలు చేసినట్లు అరుణ్ కుమార్ ఒప్పుకున్నాడు. రిమాండ్ పై జైలుకు వెళ్ళిన అరుణ్ కుమార్ ఇటీవల విడుదలయ్యాడు. భార్య నిషా రాణి పై కోపం పెంచుకున్న అరుణ్ కుమార్ నాటకీయంగా తిరిగి వచ్చి భార్య తో కలిసి ఉంటున్నాడు. మరోసారి మర్డర్ కు ప్లాన్ చేసి గత నెల 27 వ తేదిన ముజ్మిల్ అలీ ఖాన్ సహాయంతో మహారాష్ట్ర ఉమ్రి ప్రాంతానికి వెళ్ళి దేశవాళీ తుపాకిని కొనుగొలు చేసుకున్నాడు. ప్లాన్ లో భాగంగా బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నిషారాణితో గొడవ పడి తుపాకీ తో ఆమె పై నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా రెండు బుల్లెట్ ఆమె శరీరంలోకి దూసుకుపోయి అక్కడిక్కడే మరణించింది.
ఆ తర్వాత పారిపోయిన అరుణ్ కుమార్ అతనికి సహకరించిన ముజ్మిల్ ను పోలీసులు మౌలాలీ ప్రాంతంలో గురువారం అరెస్టు చేశారు. నిందితుడు అరుణ్ కుమార్ నుంచి కంట్రిమేడ్ పిస్టల్, ఖాళీ మ్యాగజిన్, మూడు కత్తులు, సర్జికల్ బ్లేడ్, కారు, స్కూటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన మరో నిందితుడు హరిందర్ సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు. గ్రుహ హింస, బెదిరింపులు వంటి వ్యవహారాలపై మహిళలు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీసీపీ కోరారు. అదే విధంగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని డీసీపీ తెలిపారు.






