- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. గుంతలోని ట్రాక్టర్ బయటికీ..!
డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామంలో మురికి కాలువ గుంతలో నెల రోజులుగా ఇరుక్కుపోయిన పారిశుద్ధ్య ట్రాక్టర్ ట్రాలీపై దిశ వెబ్ లింక్ కథనం గురువారం ఉదయం ప్రచురితం కాగానే అధికారులు స్పందించారు.

X
దిశ, డోంగ్లి, (మద్నూర్) : డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామంలో మురికి కాలువ గుంతలో నెల రోజులుగా ఇరుక్కుపోయిన పారిశుద్ధ్య ట్రాక్టర్ ట్రాలీపై దిశ వెబ్ లింక్ కథనం గురువారం ఉదయం ప్రచురితం కాగానే అధికారులు స్పందించారు. దిశలో వార్త రాగానే గ్రామ పంచాయతీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో ట్రాక్టర్ ట్రాలీని బయటకు తీశారు. బురదను శుభ్రం చేసి పారిశుద్ధ్య పనుల్లోకి తిరిగి వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. దిశ కథనంతో సమస్య పరిష్కారమైనందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Next Story






