థియేటర్లో పుట్టి ఓయో రూముల్లో అంతమయ్యేదే ప్రేమ : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ నేటి తరం ప్రేమకథలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

థియేటర్లో పుట్టి ఓయో రూముల్లో అంతమయ్యేదే ప్రేమ : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ నేటి తరం ప్రేమకథలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 'దీవానా' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, ప్రస్తుత సమాజంలో ఉన్న లవ్ ట్రెండ్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వేడుకలో భాగంగా యంగ్ హీరో విష్వక్సేన్.. అల్లు అరవింద్‌ను ఉద్దేశించి ఆయన వ్యక్తిగత లవ్ స్టోరీని పంచుకోవాలని కోరారు.

దీనికి అల్లు అరవింద్ తనదైన శైలిలో స్పందిస్తూ.. తనకు గతంలో చాలా లవ్ స్టోరీలు ఉన్నాయని, అయితే అవన్నీ వన్-సైడ్ ప్రేమకథలుగానే మిగిలిపోయాయని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, నేటి తరం ప్రేమ వ్యవహారాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఈ రోజుల్లో ప్రేమ అనేది థియేటర్లలోని కార్నర్ సీట్లలో పుట్టి, ఆ తర్వాత షాపింగ్ మాల్స్ చుట్టూ తిరిగి, చివరకు 'ఓయో' (OYO) రూముల్లో అంతమైపోతోంది" అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాలంలో నిజమైన ప్రేమను ఊహించడం కష్టమని, కానీ 'దీవానా' చిత్రంలో పాత రోజుల్లో ఉండేలాంటి స్వచ్ఛమైన ప్రేమను అద్భుతంగా చూపించారని కొనియాడారు.

ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వేదికపై ఉన్నవారంతా నవ్వులు చిందించినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మాత్రం అల్లు అరవింద్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి తరం యువతను, వారి ప్రేమను అంతలా కించపరిచేలా ఓపెన్ స్టేజ్‌పై మాట్లాడటం తగదంటూ కొందరు తప్పుబడుతుండగా, ఆయన చెప్పింది నేటి సమాజపు చేదు నిజమేనంటూ మరికొందరు మద్దతు ఇస్తున్నారు. మొత్తానికి అల్లు అరవింద్ చేసిన ఈ 'ఓయో' కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story