- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత పార్టీ పేరుపై BIG ట్విస్ట్.. TRS మాదేనంటూ ఈసీకి భారీగా అభ్యంతరాలు
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు చుట్టూ ఇప్పుడు పెద్ద ‘టైటిల్ వార్’ నడుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో TRS పేరు కోసం రాజకీయ పార్టీల మధ్య టైటిల్ వార్ ముదురుతోంది. టీఆర్ఎస్ పేరు వచ్చేలా తెలంగాణ రక్షణ సేన పేరుతో కల్వకుంట్ల కవిత ప్రకటించిన పార్టీ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ న్యూస్ పేపర్లలో కవిత ఇచ్చిన యాడ్స్ పై దాదాపు 700 అభ్యంతరాలు అందినట్లు తెలుస్తోంది.
సోలాపూర్ నేత దరఖాస్తుతో కొత్త ట్విస్ట్!
కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించాడనికి ఒక రోజు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ''తెలంగాణ రాష్ట్రసామాజిక సేన" (TRS) అనే పార్టీ పేరు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కవిత ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన, దాయానంద్ దరఖాస్తు చేసుకున్న తెలంగాణ రాష్ట్రసామాజిక సేన రెండు పార్టీల సంక్షిప్త నామం ‘TRS’ ఒక్కటే కావడంతో ఈసీ వద్ద టైటిల్ వార్ మొదలైందనే చర్చ జరుగుతోంది.
కంటిన్యూ? క్లోజ్?
రాజకీయాల్లో సొంత వేదిక ఏర్పాటు చేసుకోవాలని గత కొంత కాలంగా కసరత్తు చేసుకున్న కవితకు పార్టీ పేరు విషయంలో అడ్డంకులు తప్పడం లేదు. గత నెలలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సమయంలో కవిత తన నోటితో మన పార్టీ పేరు టీఆర్ఎస్ ప్రకటించగా ఆ వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్లపై మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రదర్శించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే తెలంగాణ రక్షణ సేనగా ప్రకటించారు. దీంతో రోజుల వ్యవధిలోనే పార్టీ పేరు మారడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో మరోసారి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కవిత కొత్త పార్టీకి 'TRS' అనే పేరు కొనసాగబోతోందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.






