- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధ్యాప్యంలోనూ కంటిచూపు తగ్గకుండా.. !
వృద్ధాప్యంతోపాటు వచ్చే కంటి సమస్యల నివారణకు ER-100 అనే కొత్త థెరపీని లైఫ్‌సైన్సెస్ పరిశోధకులు డెవలప్ చేశారు.

దిశ, ఫీచర్ : వృద్ధాప్యంతోపాటు వచ్చే ఆరోగ్య సమస్యల్లో కంటిచూపు మందగించడం ఒకటి. యవ్వనంలో ఈ సమస్య వస్తే చికిత్స ద్వారా మెగురుపడే అవకాశం ఎక్కువ. కానీ వయసు మీదపడ్డాక ట్రీట్మెంట్ తీసుకున్నా.. పెద్దగా ఫలితం ఉండదు. కానీ భవిష్యత్తులో అలాంటి పరిస్థికి చెక్ పెట్టే అద్భుతమైన మార్గం ఇక ఏర్పడినట్టే. ఎందుకంటే.. యూఎస్‌కు చెందిన లైఫ్ బయో సైన్సెస్ (Life Biosciences, Inc) అనే బయోటెక్ కంపెనీ ER-100 అనే ఒక కొత్త థెరపీని డెవలప్ చేసింది. ఇది వృద్ధాప్యంతోపాటు వచ్చే కంటి సమస్యను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఎపిజెనెటిక్ రిస్టోరేషన్ (ER-100)థెరపీని మొదటిసారిగా జూన్ 9న మానవులకోసం ఉపయోగించినట్లు లైఫ్ బయోసైన్సెస్ పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇది ఈఆర్ రీప్రోగ్రామింగ్ ఆధారంగా పనిచేసే సెల్యులార్ రీజువినేషన్ థెరపీ. సాధారణ డ్రగ్స్(మందులు) ఒక్కో వ్యాధిని లక్ష్యం చేసుకుంటే.. ఇది వృద్ధాప్యంతో ముడిపడిన బయోలాజికల్ మెకానిజమ్‌లను పరిష్కరించి, కణాలను యవ్వన స్థితికి తీసుకురావడాన్ని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం ఇది ఆప్టిక్ న్యూరోపతీలు(కంటి నరాల సమస్యలు), ముఖ్యంగా ఓపెన్ యాంగిల్ గ్లాకోమా (OAG), నాన్-ఆర్టరైటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి(NAION) చికిత్సకు Phase-1 క్లినికల్ ట్రయల్‌లో ఉంది.
ప్రయోజనాలు-ప్రాముఖ్యత
ఎపిజెనెటిక్ రిస్టోరేషన్ (ER-100) థెరపీ అనేది ఒకేసారి ఇవ్వబడే ఇంజెక్షన్ ద్వారా కణాల్లోని ఎపిజెనెటిక్ మార్కులను రీసెట్ చేస్తారు. దృష్టి సంబంధిత కణాల పనితీరును మెరుగుపరచడమే దీని లక్ష్యం. ఇది వృద్ధాప్యం, వ్యాధి వల్ల దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ట్రయల్ ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, విజయవంతమైతే వృద్ధాప్యం, దీర్ఘాయువు, వ్యాధి నివారణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇది కంటి సంబంధిత వ్యాధులకు మాత్రమే పరీక్షించబడుతోంది. ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వస్తే.. వృద్ధాప్యంలోనూ కంటిచూపు మందగించడం వంటి సమస్యలకు చెక్‌పెట్టే మార్గం సుగమమైనట్టేనని నిపుణులు చెబుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






