యువత రంజిత్‌ను ఆదర్శంగా తీసుకోవాలి:జిల్లా ఎస్పీ నితిక పంత్

by Jakkula.Mamatha |

యువత రంజిత్‌ను ఆదర్శంగా తీసుకొవాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు.

యువత రంజిత్‌ను ఆదర్శంగా తీసుకోవాలి:జిల్లా ఎస్పీ నితిక పంత్
X

దిశ, ఆసిఫాబాద్: యువత రంజిత్‌ను ఆదర్శంగా తీసుకొవాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం 13 జిల్లాల మీదుగా 17 రోజుల పాటు వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి.. ఇండియన్ వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్న రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన ఓరగంటి రంజిత్‌ను గురువారం జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించడం నేటి సమాజానికి అత్యంత అవసరమని అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం 1000 కి.మీ సైకిల్ యాత్ర చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమన్నారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. రంజిత్ సాధించిన ఈ గుర్తింపు జిల్లాకు గర్వకారణమని జిల్లా ఎస్పీ కొనియాడారు.

Next Story