కొడంగ‌ల్ లో రోడ్లు వేస్తే అభివృద్ధా..?

by Nallavelli.Anjaneyulu |

కొడంగల్ లో అన్ని ప్రాంతాలకు రోడ్లు భవనాలు చేస్తే సరిపోతుందా ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రద్ధ చూపడం లేదని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.

కొడంగ‌ల్ లో రోడ్లు వేస్తే అభివృద్ధా..?
X

దిశ‌, మ‌క్త‌ల్ : కొడంగల్ లో అన్ని ప్రాంతాలకు రోడ్లు భవనాలు చేస్తే సరిపోతుందా ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రద్ధ చూపడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు పక్షపాతంతో వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నట్టుగా అన్ని రంగాలలో వెనుకబడిన కరువు జిల్లా పాలమూరు అభివృద్ధిపై రేవంత్ రెడ్డి శ్రద్ధ చూపడం లేదని బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. మక్తల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఆమె ఎంపిక చేసిన పలు ఉద్యోగాల నుంచి విశ్రాంతి పొందుతున్న సీనియర్ సిటిజన్స్ ను వారి ఇంటికి వెళ్లి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అరుణ మాట్లాడుతూ ఎన్నికల అప్పుడు కెసిఆర్ ఆడిన గారడి మాటలని ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడని వారి బాటలో నడుస్తున్న సి ఎం ఈ ప్రాంత అభివృద్ధిలోఎందుకు అనుసరించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండున్నర సంవత్సరాల కాల కరిగిపోయిందని .ఇచ్చిన హామీలు తీర్చడానికి సమయం ఎక్కడుందని. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో బారి మెజార్టీతో బిజెపి అధికారం లోకి వస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు తిరుగేందుకు భయపడుతున్నారని ఎక్కడికెళ్లిన‌ హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారని అభివృద్ధి పేరు మీద తెచ్చిన అప్పులపై ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో జనాన్ని మభ్యపెట్టేందుకు కొత్తగా సాగునీటి ప్రాజెక్టులను తెర మీదకి తెస్తున్నారని గత ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా తాగు సాగునీటి కష్టాలు తీరుతాయని దానిపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల‌వుతున్న‌ పథకాలన్నిటిలో సగం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న దని ఆ విషయాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ నాయ కులకు ధైర్యం చాలడం లేదని ఆమె అన్నారు. జిల్లాలో ప్రాజెక్టుల కింద ముంపు గురైన ప్రాంతాల గ్రామాల ప్రజలకు పునరావాసం ఏర్పాటు భూ సేకరణ నష్టపరిహారం సమస్యలు ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయిందని.. దానిపై మంత్రులు సీఎం దృష్టి పెట్టాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రతన్ పాన్ రెడ్డి, బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి, లక్ష్మీబలరాం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కర్ని స్వామి, భాస్కర్, ఎం.వెంకట్, రాములు, వెంకటేష్‌, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story