- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాదంను ఎందుకని రాత్రిపూట నానబెట్టే తినాలంటారు?
బాదం పోషకాల ఖజానా. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా బాదం రాత్రిపూట నానబెట్టి ఉదయం తొక్క తీసి తినాలని అందరూ చెబుతుంటారు. దీనివల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని అంటారు. అయితే ఇలా నానబెట్టి మాత్రమే ఎందుకు తినాలి? అలాగే తినడం మంచిది కాదా? అనే సందేహాలు సైతం పలువురు వ్యక్తం చేస్తుంటారు. పోషకాహార నిపుణుల ప్రకారం.. ఎలా తిన్నా అవేపోషకాలు అందుతాయి. కానీ నానబెట్టి తినడంవల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
పోషకాలు ఫుల్..
బాదం పోషకాల ఖజానా. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పైగా రాత్రిపూట నానబెట్టడంవల్ల బాదం తొక్క మెత్తగా మారి, నమలడం సులభం అవుతుంది. ఈజీగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా బాదం తొక్కలో టానిన్స్, ఫైటిక్ యాసిడ్ అనే సమ్మేళనాలు సహజంగానే ఉంటాయి. ఇవి కొంతమందిలో ఖనిజాల శోషణను తగ్గించవచ్చు. దీంతో పిల్లల్లో, వృద్ధుల్లో బ్లోటింగ్, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తాతాయి. కాగా నానబెట్టడంవల్ల వాటి తొక్క ఊడిపోయి, మెత్తగా మారి, జీర్ణం కావడం సులభం అవుతుంది. అందుకే రాత్రి నానబెట్టి, తొక్క తీసిన బాదం తినడం మంచిది అంటారు పెద్దలు, నిపుణులు. పైగా ఇలా చేస్తే రుచికరంగానూ ఉంటుంది.
నానబెట్టడం వల్ల ప్రయోజనాలు
*బాదం తొక్కలో సహజంగా ఉండే కొన్ని సమ్మేళనాలు (phytates) ఖనిజాల (మెగ్నీషియం, ఐరన్ వంటివి) శోషణను కొంతవరకు అడ్డుకుంటాయి. రాత్రి నానబెట్టడం వల్ల ఈ సమ్మేళనాలు తగ్గి, పోషకాలు మన శరీరం బాగా గ్రహించుకునే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతారు. అయితే, నానబెట్టినా లేకపోయినా బాదం పోషకాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. నానబెట్టడం వల్ల రుచి మెరుగవుతుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి మంచిది.
*రోజూ నానబెట్టిన బాదం తినడం గుండె ఆరోగ్యానికి మంచిది, దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుంది. అందుకే ఎక్కువ మంది రాత్రి నానబెట్టి ఉదయం తొక్క తీసి తినడాన్ని ఇష్టపడతారు. అయితే బాదం రోజూ తినడం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. కొందరికి పడకపోవచ్చు. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితి తినాలా వద్దా అనే విషయంలో డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.






