- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TCS: ఏఐ రేసులో టీసీఎస్ కీలక అడుగు
చాట్‌జీపీటీకి గట్టి పోటీనిస్తున్న ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్'తో టీసీఎస్ గ్లోబల్ డీల్‌ను కుదుర్చుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవలను మరింత వేగంగా అందించేందుకు భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ డీల్‌ను ప్రకటించింది. చాట్‌జీపీటీకి గట్టి పోటీనిస్తున్న ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్'తో టీసీఎస్ గ్లోబల్ డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం టీసీఎస్ ప్రత్యేకంగా ఒక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా.. ఇంజనీరింగ్, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్ విభాగాల్లోని తన 50,000 మంది ఉద్యోగులకు నేరుగా క్లాడ్ ఏఐ లైసెన్సులను అందిస్తోంది. ఇప్పటికే లక్ష మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కోపైలట్ సేవలను విస్తరించిన టీసీఎస్, ఇప్పుడు ఈ కొత్త పార్ట్‌నర్‌షిప్ ద్వారా తన సొంత కార్యకలాపాలను ఆధునీకరించుకుంటూనే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన క్లయింట్లకు సరికొత్త ఏఐ సొల్యూషన్స్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణంగా బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ప్రభుత్వ సేవలు, టెలికాం వంటి అత్యంత కఠినమైన నిబంధనలు ఉండే రంగాలలో ఏఐ ప్రయోగాలు పర్యవేక్షణ లోపాల వల్ల మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకే క్లాడ్ ఏఐ కచ్చితత్వాన్ని తమ బిజినెస్ స్కిల్స్‌తో కలిపి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ స్పష్టం చేశారు.






