- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు 50% సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాలు
రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్టె (గ్రీన్ మ్యాన్యూర్) విత్తనాలు అయినటువంటి జనము, జీలుగ విత్తనాలు షాబాద్ పిఎసిఎస్ నందు అందుబాటులో ఉన్నాయని షాబాద్ మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర తెలిపారు.

దిశ, షాబాద్: రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్టె (గ్రీన్ మ్యాన్యూర్) విత్తనాలు అయినటువంటి జనము, జీలుగ విత్తనాలు షాబాద్ పిఎసిఎస్ నందు అందుబాటులో ఉన్నాయని షాబాద్ మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూసారాన్ని పెంపొందించడంతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పచ్చి రొట్టె పంటల సాగు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఆయా రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి ఆసక్తి గల రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, ఇతర అవసరమైన పత్రాలతో సమీప వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించి విత్తనాలకు సంబంధించిన టోకెన్లు తీసుకొని కో ఆపరేటివ్ సొసైటీ నందు పచ్చిరొట్ట విత్తనాలను తీసుకోవాలని తెలిపారు. పచ్చి రొట్టె పంటలను సాగు చేయడం ద్వారా నేల సారవంతం కావడంతో పాటు తదుపరి పంటలకు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ అవకాశాన్ని మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.






