- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం పర్యటన ఏర్పాట్లపై స్థలాల పరిశీలన..
ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి కనగల్ మండలంలో పర్యటించి వివిధ ప్రాంతాలను పరిశీలించారు.

దిశ, కనగల్: ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ గురువారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి కనగల్ మండలంలో పర్యటించి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.14,500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హ్యాం రోడ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, బహిరంగ సభ,హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ఏర్పాట్ల కోసం అనువైన స్థలాలను అధికారులు పరిశీలించారు. కనగల్ జూనియర్ కళాశాల సమీపంలోని స్థలాన్ని బహిరంగ సభ కోసం, దేవరకొండ రోడ్డులో గోదాం పక్కనున్న ప్రాంతాన్ని హ్యాం రోడ్ల పైలాన్ ఏర్పాటుకు పరిశీలించారు.అలాగే సభాస్థలి,వాహనాల పార్కింగ్ ప్రాంతాలతో పాటు చెట్ల చెన్నారం,ధర్వేశిపురం ప్రాంతాల్లో హెలిప్యాడ్‌ల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు...
ధర్వేశిపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ సందర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా అధికారులు దృష్టి సారించారు. పర్యటన సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల మళ్లింపు తదితర అంశాలపై కలెక్టర్, ఎస్పీ చర్చించారు. బహిరంగ సభ వేదిక, టెంట్లు,కు ర్చీలు, భద్రతా కేడ్లు తదితర ఏర్పాట్లపై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,తాసిల్దార్ బి.పద్మ, ఎంపీడీవో ఏ.వేద రక్షిత,డి.ఎస్.పి కే.శివరామిరెడ్డి, ఎల్లమ్మ ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి,సర్పంచ్ నర్సింగ్ మురళీధర్ గౌడ్, ఆర్టిఏ నెంబర్ కూసుకుంట్ల రాజురెడ్డి, సీఐ ఆదిరెడ్డి, ఎస్సై కే.రాజీవ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ గోలి జగాల్ రెడ్డి, నర్సింగ్ కృష్ణయ్య గౌడ్, గడ్డం అనుప్ రెడ్డి, ఆర్అండ్బి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






