- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రామగుండం సీపీ
పోలీస్ స్టేషన్ కు సమస్యలపై వచ్చే ప్రజల ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.

దిశ, మంచిర్యాల: పోలీస్ స్టేషన్ కు సమస్యలపై వచ్చే ప్రజల ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం జిల్లాలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో కలియతిరిగారు. ఐటి విభాగం, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్ వద్ద క్రైమ్ వివరాలను నమోదు చేసే ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. క్రైమ్ రేట్ వివరాలు, పలు రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పలు సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు తక్షణ సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. సిబ్బంది విధుల పట్ల సమయపాలన, క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు. గ్రామాల్లో గుడుంబా, గాంజా, మాదకద్రవ్యాల పై నిఘా ఉంచాలన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గంగారం, సిబ్బంది తదితరులు ఉన్నారు.






