- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఎమ్మెల్యే బంధువు ఘరానా మోసం.. ఎమ్మెల్యేకు అందిన ఫిర్యాదు
కడప మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా బామ్మర్ది కొడుకు మహమ్మద్ యాహియా ఘరానా మోసానికి పాల్పడ్డారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.1.50 లక్షలు వసూలు చేశారంటూ బాధితులు ఆరోపించారు...

దిశ, వెబ్ డెస్క్: కడప మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా(Former Kadapa MLA Amjad Basha) బామ్మర్ది కొడుకు మహమ్మద్ యాహియా(Mohammed Yahya) ఘరానా మోసానికి పాల్పడ్డారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.1.50 లక్షలు వసూలు చేశారంటూ బాధితులు ఆరోపించారు. పూర్తి పత్రాలు, సాక్ష్యాలతో సహా ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవికి ఫిర్యాదు చేశారు. తమ కష్టార్జితాన్ని తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఆయన అనుచరులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ముసుగులో నిరుపేదలను మోసం చేశారని మండిపడ్డారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మోసానికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేలా విచారణ జరిపిస్తామని రెడ్డెప్పగారి మాధవి హెచ్చరించారు.
కాగా మన కడప - స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా కడప నబికోట ప్రాంతంలో ఆమె పర్యటించారు. ఈ పర్యటనలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సమయంలో ఎమ్మెల్యేను నబికోటకు చెందిన బద్రిపల్లి గుర్రప్ప కలిశారు. మాజీ ఎమ్మెల్యే అనుచరులు చేసిన మోసాన్ని ఆమెకు వివరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.






