ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ వ్యవహారం.. సొంత చెల్లిని దారుణంగా చంపిన అన్న

by Kema Shiva Kumar |

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం నచ్చలేదని కన్నవారే కాలయములుగా మారిని యువతిని అతి దారుణంగా హతమార్చారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ వ్యవహారం.. సొంత చెల్లిని దారుణంగా చంపిన అన్న
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా (Social Media) ప్రభావంతో దేశంలో నేరాలు, ఘోరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కన్నవారే కాలయములుగా మారిన ఓ దారుణం తమిళనాడు (Tamilnadu)లో వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram)‌తో ఏర్పడిన ఓ ప్రేమ వ్యవహారం నచ్చలేదనే కారణంతో యువతిని ఆమె సొంత అన్న, తల్లి కలిసి అత్యంత క్రూరంగా హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరునెల్వేలి జిల్లాలో బాధితురాలైన యువతి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో పరిచయం పెంచుకుని అతడితో ప్రేమలో పడింది. ఈ విషయం కాస్త ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా మందలించారు. ఆ యువకుడితో బంధాన్ని తెంచుకుని ఇన్‌స్టాగ్రామ్‌ వాడటం ఆపేయాలని గట్టిగా హెచ్చరించారు. కానీ, కుటుంబ సభ్యుల హెచ్చరికలను పక్కనబెట్టి ఆ యువతి తన ప్రేమ వ్యవహారాన్ని అలాగే కొనసాగించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె అన్న, ఆవేశంతో ఆమెపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ నేరంలో ఆ యువతి కన్నతల్లి కూడా కొడుకుకు సహకరించినట్లుగా విచారణలో తేలింది.

సోదరుడు, తల్లి అరెస్ట్..

యువతి హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతిని చంపిన ఆమె సోదరుడిని.. అందుక సహకరించిన తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది ఒక పరువు హత్య (Honour Killing) కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియా పరిచయాలు, ప్రేమ వ్యవహారం కారణంగా కన్న కూతురు అని చూడకుండా తల్లి, తోడబుట్టువు అని చూడకుండా అన్న ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది.

Next Story