- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పానీ పూరి తిని బాలిక అస్వస్థత.. కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు
అపరిశుభ్రంగా విక్రయించిన పానీ పూరి తిని ఓ మూడేళ్ల బాలిక వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన ఘటన అంబర్పేట్‌లో చోటుచేసుకుంది.

దిశ, సికింద్రాబాద్: అపరిశుభ్రంగా విక్రయించిన పానీ పూరి తిని ఓ మూడేళ్ల బాలిక వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన ఘటన అంబర్పేట్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అంబర్‌పేట్ ఆజాద్‌నగర్‌కు చెందిన జక్రియా ఈ నెల 10వ తేదీ సాయంత్రం చే నెంబర్ చౌరస్తా నుంచి జిందా తిలిస్మాత్ వెళ్లే మార్గంలో ఉన్న ఓ పానీపూరి బండి వద్ద నుంచి పానీపూరి పార్సెల్ తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన అనంతరం ఆయన కుమార్తె హుదా(3) పానీపూరి తినగా, కొద్దిసేపటికే కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమైనట్లు తండ్రి తెలిపారు.
ఈ విషయమై పానీపూరి బండి నిర్వాహకుడిని ప్రశ్నించగా.. తమ ఆహార పదార్థాల్లో ఎలాంటి లోపం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే సంబంధిత పానీపూరి బండి ఓ మ్యాన్‌హోల్ పైనే ఏర్పాటు చేయబడిందని, చుట్టుపక్కల ఈగలు ముసురుకొని పరిశుభ్రత లేకుండా ఉండటం గమనించామని స్థానికులు తెలిపారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై ఆహార భద్రత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారికంగా ఆహార భద్రత శాఖ స్పందించాల్సి ఉంది. బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.






