- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు నుంచి జారి పడి యువకుడి మృతి
by Taduka Kalyani |
మాసాయిపేట్ మండల పరిధిలోని స్టేషన్ మాసాయిపేట్ రైల్వే స్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెల్దుర్తి: మాసాయిపేట్ మండల పరిధిలోని స్టేషన్ మాసాయిపేట్ రైల్వే స్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన దుందిగొల్ల దాస్ (28) రైలు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు ఆయన శరీరం రెండు ముక్కలైనట్లు సమాచారం. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై స్టేషన్ మాస్టర్ కామారెడ్డి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టారు.
Next Story






