- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటవీ సంపదను కాపాడుకుందాం : ఎఫ్ఆర్ఓ దివ్య
అడవి సంపదను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎఫ్ఆర్ఓ దివ్య పేర్కొన్నారు.

దిశ, నర్సాపూర్ : అడవి సంపదను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎఫ్ఆర్ఓ దివ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 11వ రోజు కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ రేంజ్ ఆఫీసర్ దివ్య ఆధ్వర్యంలో నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్‌లో వనదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ దివ్య విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, ప్లాస్టిక్ నివారణ, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ,ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధి రామ్ సింగ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు సాయిరాం, రాజమణి, శ్రీధర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్ సురేష్, కుంఫు మాస్టర్ స్వామి, అర్బన్ పార్క్ సిబ్బంది మరియు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.






