- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మిద్దాం..
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రాంతీయ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ సైంటిస్ట్ అన్నారు.

దిశ, గోదావరిఖని: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలిద్దామని, పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రాంతీయ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ సైంటిస్ట్ ఇ.కనక జ్యోతి అన్నారు. గురువారం గోదావరిఖనిలోని జ్యోతినగర్ జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఎన్.సి.సి విద్యార్థులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానికారక ప్రభావాలు, భూమి, నీరు, జీవ వ్యవస్థలకు వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సైంటిస్ట్ ఇ.కనకజ్యోతి మాట్లాడుతూ, నిత్యజీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి పాటించాల్సిన నియమాలు, అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలను విద్యార్థులకు వివరించారు, విద్యార్థులచే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి, బయో-డిగ్రేడబుల్ వస్తువులను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు ఈ కార్యక్రమంపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఎన్.సి.సి కో-ఆర్డినేటర్ తిరుపతి, ఎన్.జి.సి కో-ఆర్డినేటర్ అంజన్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్.సి.సి విద్యార్థులు పాల్గొన్నారు.






