- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని గురువారం బషీరాబాద్ గ్రామ పంచాయితీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ శాఖ ఏఈ కృష్ణకాంత్ కు వినతి పత్రం అందజేశారు.

X
దిశ, కమ్మర్ పల్లి : వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని గురువారం బషీరాబాద్ గ్రామ పంచాయితీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ శాఖ ఏఈ కృష్ణకాంత్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పసుపు, మక్కలు విత్తనాలు, ఇతర పంటలు సాగుచేస్తున్నారు. రైతులకు విద్యుత్ సరపరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో లాగ 18-20 గంటల విద్యుత్ సరఫరా చేయాలనీ కోరారు. స్పందించిన ఏఈ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాన్ని పెంచేందుకు పై అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Next Story






