- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"రూ.370 పెట్టి బిర్యానీ కొనిస్తే చాలు అమ్మాయిలు పడుకోడానికి వస్తారు" : నెట్టింట్లో తీవ్ర దుమారం రేపుతున్న స్టాండప్ కామెడీ షో కామెంట్లు
అమ్మాయిలకు ఒక బిర్యానీ కొనిస్తే చాలు పైసా వసూల్ కింద వారితో పడుకోవచ్చు అంటూ ఓ స్టాండప్ కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయిలకు ఒక బిర్యానీ కొనిస్తే చాలు పైసా వసూల్ కింద వారితో పడుకోవచ్చు అంటూ ఓ స్టాండప్ కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. గురుగ్రామ్‌లో జరిగిన ఒక ఫేమస్ స్టాండప్ కమెడియన్ షోలో మహిళలను కించపరిచేలా మాట్లాడటం పట్ల నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ప్రముఖ స్టాండప్ కామెడియన్, బిగ్ బాస్ ఫేమ్ ప్రణీత్ మోరే నిర్వహించిన లైవ్ షోలో, ఆడియన్స్‌తో మాట్లాడే 'క్రౌడ్ వర్క్' లో ఈ ఘటన చోటుచేసుకుంది. షోకు హాజరైన హిమాన్షు జంగ్రా అనే యువకుడు తన వ్యక్తిగత డేటింగ్ అనుభవాన్ని పంచుకుంటూ.. తాను ఒక అమ్మాయికి రూ.370 పెట్టి చికెన్ బిర్యానీ కొనిపించానని, ఆ తర్వాత ఆమె తనను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగితే, "నీ కోసం రూ.370 ఖర్చు పెట్టాను కదా, ఆ డబ్బును ఏదో ఒక రకంగా వసూలు చేసుకోవాలి అంటే ఎలా లైంగికంగా అనుభవించాలని ఉందో చెబుతూ" అత్యంత అసభ్యకరంగా, నవ్వుతూ వ్యాఖ్యానించాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి, కామెడియన్ ప్రణీత్ మోరేతో సహా అక్కడున్న వారంతా పగలబడి నవ్వుతూ.. దానిని "పీక్ గురుగ్రామ్ కంటెంట్" (Peak Gurgaon Content) అని ప్రోత్సహించడమే కాకుండా, సదరు యువకుడికి వేదికపైనే ఒక బహుమతిని కూడా అందజేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఈ షోకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నెటిజన్ల నుండి ఊహించని స్థాయిలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. రూ.370 బిర్యానీ కొనిస్తే మహిళలు శారీరకంగా లొంగిపోవాలనే ఆ యువకుడి అహంకారపూరిత ధోరణిని, 'మిసోజినీ', మహిళల కన్సెంట్ తో సంబంధం లేకుండా ప్రవర్తించే వికృత మానసిక స్థితిని పలువురు సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీసిందంటే.. నెటిజన్ల ఒత్తిడితోపాటు, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా హిమాన్షు జంగ్రా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అలాగే, ఈ అసభ్య కామెంట్లను వేదికపై ప్రోత్సహించినందుకు నెటిజన్ల ట్రోలింగ్ భరించలేక కామెడియన్ ప్రణీత్ మోర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసుకున్నారు. పరిస్థితి చేదాటిపోవడంతో తప్పు తెలుసుకున్న ఇద్దరూ ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణలు చెబుతూ వీడియోలను విడుదల చేశారు.
ఈ సంఘటన కేవలం ఒక కామెడీ షో వివాదంగా మిగిలిపోకుండా, ప్రస్తుత సమాజంలో డేటింగ్ సంస్కృతి, మహిళల భద్రత, కామెడీ పేరుతో ప్రదర్శిస్తున్న వికృత మెంటాలిటీపై దేశవ్యాప్తంగా లోతైన చర్చకు దారితీసింది. నలుగురిలో నవ్వులు పూయించడం కోసమో, కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకోవడం కోసమో మహిళల ఆత్మగౌరవాన్ని, వారి కన్సెంట్ ను కించపరిచే హక్కు ఎవరికీ లేదని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్స్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లలో #BiryaniIsNotConsent వంటి హ్యాష్‌ట్యాగ్‌లు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుండటం, మహిళల రక్షణ, ఆత్మగౌరవం, సమానత్వం పట్ల నేటి తరం ఎంత స్పష్టమైన అవగాహనతో ఉందో నిరూపిస్తోంది. హాస్యం అనేది ఇతరులను నవ్వించేలా ఉండాలి కానీ, ఒకరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా ఉండకూడదంటూ పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. బాగా చదువుకొని, ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తూ, సొసైటీలో గొప్ప పేరున్న వాళ్ళు కూడా మహిళలను లైంగిక భావిస్తూ, వారి పట్ల ఘోరమైన చిన్నచూపు ఉంటుందని ఈ ఘటన ఎత్తి చూపుతోంది. అంతేకాదు అమ్మాయిలు ఎవ్వరి మీద ఆధారపడకుండా బతకాలని, ఆర్థిక స్వతంత్రం ఉండాలని, ఎవరైనా తమ మీద ఖర్చు పెడుతుంటే వారి మనసులో ఇలాంటి వికృత ఆలోచనలు ఎక్కడో ఒక మూల ఉంటాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.






