- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంజారా సాహిత్య పరిరక్షణకు ‘ధూళి చక్రాలు’ విశిష్ట సేవలు అందిస్తాయి: జాటోత్ రామ్‌చందర్ నాయక్
బంజారా సమాజ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం, సాహిత్య పరిరక్షణకు “ధూళి చక్రాలు”, “ది వీల్స్ ఆఫ్ డస్ట్”, “రిఫ్లెక్షన్స్ ఆఫ్ బంజారా” గ్రంథాలు విశిష్టమైన సేవలందిస్తాయని తెలంగాణ శాసనసభ విప్ డా.జాటోత్ రామ్‌చందర్ నాయక్ పేర్కొన్నారు.

దిశ,రవీంద్ర భారతి: బంజారా సమాజ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం, సాహిత్య పరిరక్షణకు “ధూళి చక్రాలు”, “ది వీల్స్ ఆఫ్ డస్ట్”, “రిఫ్లెక్షన్స్ ఆఫ్ బంజారా” గ్రంథాలు విశిష్టమైన సేవలందిస్తాయని తెలంగాణ శాసనసభ విప్ డా.జాటోత్ రామ్‌చందర్ నాయక్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, బంజారా సాహిత్య అకాడమీ(హైదరాబాద్) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతి మినీ సమావేశ మందిరంలో గ్రంథావిష్కరణ కార్యక్రమం జరిగింది. డా.పత్తిపాక మోహన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ విప్ డా.జాటోత్ రామ్‌చందర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని డా.ఎం.ధనంజయ్ నాయక్ మూడ్ రచించిన “ధూళి చక్రాలు”, “ది వీల్స్ ఆఫ్ డస్ట్”, “రిఫ్లెక్షన్స్ ఆఫ్ బంజారా” (ఆచార్య సూర్యా ధనుంజయ్ రచన “బంజారా నానీలు” అనువాదం) అనే మూడు గ్రంథాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రచయిత ధనంజయ్‌ను ఆయన అభినందించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి(ఐఏఎస్) బంజారా సంప్రదాయాలు, చరిత్ర, వారసత్వాన్ని లిఖిత రూపంలో భద్రపరచడంలో డా. ధనంజయ్ నాయక్ చేసిన కృషిని ప్రశంసించారు. డా.రమేష్ ఆర్య మాట్లాడుతూ.. బంజారా సాహిత్య చరిత్రలో ధూళి చక్రాలతో డా.ధనంజయ్ నాయక్ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారన్నారు. బంజారాల హక్కులకై పోరాటం చేయడం మాత్రమే కాదు వారి ఘనమైన చరిత్రను నమోదు చేశారన్నారు. ఈ మూడు గ్రంథాలు అంతర్జాతీయ స్థాయిలో బంజారాలను నిలబెట్టాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం వీసీ డా. సూర్య ధనంజయ్ , ఓయూ ప్రొఫెసర్ డా. ఎస్. రఘు, బంజారా సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్, కార్తీక్ నాయక్, పెద్ద సంఖ్యలో సాహితీవేత్తలు, రచయితలు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.






