ఏకీకృత టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి : ఈగ మల్లేశం

by Nallavelli.Anjaneyulu |

వరంగల్ జిల్లా చేనేత కార్మికుల నిరసన దీక్ష ఏడో రోజుకు చేరుకున్న సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం దీక్ష శిబిరాన్ని సందర్శించి కార్మికులకు మద్దతు తెలిపారు.

ఏకీకృత టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి : ఈగ మల్లేశం
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : వరంగల్ జిల్లా చేనేత కార్మికుల నిరసన దీక్ష ఏడో రోజుకు చేరుకున్న సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం దీక్ష శిబిరాన్ని సందర్శించి కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తుల కొనుగోలులో అమలు చేస్తున్న టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, గతంలో మాదిరిగానే టెస్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి నేరుగా కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని, అవసరమైతే టెస్కో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ ఇండక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది చేనేత కార్మికులు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వేలాది కుటుంబాలు చేనేత పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.


ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బెడ్ షీట్లు, జంపఖానాల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. సుమారు 10 వేల మంది చేనేత కార్మికులు ఈ వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నారు వారి జీవనోపాధిని ప్రభుత్వం ఏకీకృత టెండర్ ద్వారా దూరం చేయొద్దు అన్నారు. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ గతంలో జీవో నెం.1 ప్రకారం టెస్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుండి నేరుగా బెడ్ షీట్లు, జంపఖానాలను కొనుగోలు చేసి ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా చేసేవారు అయితే ప్రస్తుతం ఆ విధానాన్ని రద్దు చేసి టెండర్ విధానాన్ని అమలు చేయడంతో చేనేత సహకార సంఘాలకు అవకాశాలు లేకుండా పోయాయి. ఫలితంగా కార్మికులు నేసిన ఉత్పత్తులు భారీగా నిల్వ ఉండిపోయి, గత రెండు నెలలుగా ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వెంటనే పూర్వ పద్ధతిని పునరుద్ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వీర మోహన్, వడ్నాల నరేందర్, ఆడెపు రవీందర్, బచ్చు ఆనందం, గోరంట్ల రాజు, చిప్ప వెంకటేశ్వర్లు, డీ.ఎస్. మూర్తి, బేతి అశోక్, బైరి శ్యామ్, యెలుగం చిన్న కొమురయ్య, యెలుగం భద్రయ్య, మేగ రాజు, కుమారస్వామి, శ్రీనివాస్, చేనేత కార్మిక సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Next Story