డబ్బులు తీసుకుని ప్రమోషన్స్‌కు రావడం లేదు.. ట్రోల్స్‌పై వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ రియాక్షన్

by Chukka Sudharani |

డబ్బులు తీసుకుని ప్రమోషన్స్‌కు రావడంలేదంటూ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై తాాజాగా క్లారిటీ ఇచ్చింది నటి వరలక్ష్మి శరత్ కుమార్.

డబ్బులు తీసుకుని ప్రమోషన్స్‌కు రావడం లేదు.. ట్రోల్స్‌పై వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ రియాక్షన్
X

దిశ, సినిమా: నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వరలక్ష్మి సహకరించడం లేదని, లక్షలకు లక్షలు డబ్బులు తీసుకుని కూడా ప్రమోషన్స్‌కు రావడం లేదంటూ సినిమా దర్శకుడు సంజీవ్ మేగోటి ఆమెపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నటిపై నెట్టింట ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే తనపై వస్తున్న నెగిటివిటీపై వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘నన్ను దేనికైతే పిలిచారో, వాటన్నింటికీ నేను హాజరయ్యాను. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు నాపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి వాటిపై పూర్తి అవగాహన లేకుండా స్పందించడం సరికాదు. కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అందుకే చిత్ర బృందం చేస్తోన్న ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించాలని అనుకోవడం లేదు.. కానీ మా టీమ్‌కు అవసరమైన సమయాల్లో మాత్రం నేను అందుబాటులోనే ఉన్నా’ అంటూ వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది.

Next Story