పర్యావరణ సమతుల్యతతోనే మానవాళి జీవనం ఆధారపడి ఉంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

by Jakkula.Mamatha |

సమస్త జీవుల మనుగడకు పర్యావరణ సమతుల్యతకు మొక్కలే జీవనాధారం, పర్యావరణ సమతుల్యతతోనే మానవాళి జీవనం ఆధారపడి ఉందని కార్మిక భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

పర్యావరణ సమతుల్యతతోనే మానవాళి జీవనం ఆధారపడి ఉంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
X

దిశ, చెన్నూర్: సమస్త జీవుల మనుగడకు పర్యావరణ సమతుల్యతకు మొక్కలే జీవనాధారం, పర్యావరణ సమతుల్యతతోనే మానవాళి జీవనం ఆధారపడి ఉందని కార్మిక భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ సమీపంలో అర్బన్ ఏకో పార్క్‌లో గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మొక్కలు నాటిన అనంతరం అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన సూచించారు. అడవులు ఎక్కువగా ఉంటే సమయానికి వర్షాలు పడి పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story