- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ దాడుల కలకలం.. కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
గల్ఫ్ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకోవడంతో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: గల్ఫ్ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకోవడంతో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ వరుస క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కువైట్ తన గగనతలాన్ని గురువారం తాత్కాలికంగా మూసివేసింది.
విమానాల మళ్లింపు
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:50 గంటల నుంచి గగనతలాన్ని మూసివేసినట్లు కువైట్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది. కువైట్‌కు రావాల్సిన పలు విమానాలను ఇతర సురక్షిత విమానాశ్రయాలకు మళ్లించారు. దేశంలోకి ప్రవేశిస్తున్న డ్రోన్లు, క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు దీటుగా అడ్డుకుంటున్నట్లు కువైట్ మిలిటరీ వెల్లడించింది.
అమెరికా స్థావరాలే లక్ష్యంగా
తమపై అమెరికా చేస్తున్న వరుస దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్‌లలో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్ సైనిక విభాగం (IRGC) ప్రకటించింది. గతంలో ఇరాన్ చేసిన దాడుల్లో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యక్షంగా దెబ్బతిని ప్రాణనష్టం కూడా సంభవించిన నేపథ్యంలో.. ఈసారి కువైట్ ముందస్తు చర్యలకు దిగింది. భద్రతా పరిస్థితులు పూర్తిగా కుదుటపడ్డాక తిరిగి గగనతలాన్ని తెరుస్తామని అధికారులు స్పష్టం చేశారు. అప్పటివరకు ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.






