- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్షల పెట్టి నిర్మించారు.. గాలికి వదిలేశారు
మండల పరిధిలోని పర్వతాపురం వైకుంఠధామాలను లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు.

దిశ, ఖిల్లా గణపురం : మండల పరిధిలోని పర్వతాపురం వైకుంఠధామాలను లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు. వాటి ఆలనా- పాలనా లేకుండా గాలికి వదిలేశారు. దీంతో ఆయా గ్రామాల్లో వైకుంఠధామాలు కంప చెట్లతో కనపడకుండా పోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో మనుషులు చనిపోతే దహన సంస్కారాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాను రాను గ్రామాలలో జనాభా పెరిగిపోయి స్మశాన వాటిక లకు భూమి లేకుండా పోతుంది. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని వైకుంఠ దామాలను నిర్మించారు. ఇక్కడే శవాలను కాల్చడానికి ప్రత్యేకంగా నిర్మాణాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చాలా గ్రామాలలో ప్రజలు వీటిని వినియోగించుకోవడం లేదు. మరణించిన వ్యక్తులను ఎవరి పట్టాభూములలో వారు దహన సంస్కారాలు చేస్తుండడంతో వైకుంఠధామాలు ముళ్లపొదలతో కూరుకుపోయాయి. గ్రామాలలో ప్రజాప్రతినిధులతో పాటు పంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తమ ఆవేదనచేస్తున్నారు. ఇటీవల సర్పంచులతోపాటు పంచాయతీ కార్యదర్శులు కూడా కేటాయింపబడ్డారు. కనీసం వారైనా వైకుంఠధామాలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు వాటిలో కంపచెట్లు మొలవకుండా ఉపయోగములకు తీసుకురావాలని గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.






